జీవిస్తున్నావా .......????
సముద్రపు కెరటాల్ల పడి లేస్తే జీవిస్తునావ్ నువ్వు
పిల్లగాలిలా పరిగెడితే జీవిస్తున్నావ్ నువ్వు
గుండెలనిండా నవ్వితే జీవిస్తున్నావ్ నువ్వు
అదే గుండెల ఏడిస్తే జీవిస్తున్నావ్ నువ్వు
ఇవేవి లేకపోతె బతికేస్తున్నావ్ అంతే ........
నులివెచ్చని సూర్య కిరణాలూ ఆనందాన్ని ఇస్తే జీవిస్తున్నావ్ నువ్వు
పచ్చదనం ఆనందాన్ని ఇస్తే జీవిస్తున్నావ్ నువ్వు
పక్కవాడి సంతోషం నీకు ఆనందాన్ని ఇస్తే జీవిస్తున్నావ్ నువ్వు
పక్కవాడి బాధ నీ కం ట్లో కన్నీరు ఇస్తే జీవిస్తున్నావ్ నువ్వు
ఇవేవి లేకపోతె బతికేస్తున్నావ్ నువ్వు అంతే .......
నిండు సముద్రం లా నిబ్బరం తో ఉంటె జీవిస్తున్నావ్ నువ్వు
రాత్రి వెన్నెలకు మనసు ఉప్పొంగితే జీవిస్తున్నావ్ నువ్వు
నీ కష్టం తో వచ్చిన చెమట చుక్క ఆనందాన్ని ఇస్తే జీవిస్తున్నావ్ నువ్వు
నీ జీవితాన్ని అప్పుడో ఇప్పుడో కాకుండా అనుక్షణం అనుబవిస్తే జీవిస్తున్నావ్ నువ్వు
ఇవేవి లేకపోతె మాత్రం కచ్చితం గా బతికేస్తున్నావ్ అంతే అంతే . . . . . . . . . . . . . . . . . . . . . .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి