manchi muchatlu

4, ఫిబ్రవరి 2015, బుధవారం

anna ani pilvadela....??

ఏంటో  అందరి బ్లాగ్ లు చదివి ఏదో ఉత్చాహం తో బ్లాగ్ రాద్దామని మొదలు పెట్ట కానీ ఎం రాయాలో ఎలా రాయాలో 
తెల్యట్లేదు.  ఏంటో నా ఆలోచనలు అని పేరు చూసి దేశ ఆర్థిక వ్యవస్థ మీదో లేకపోతే  యువత మార్గ నిర్దేషలో ఇలాంటివి అనుకునేరు మనకు అంత చిత్రం లేదులెండి  ఎందుకంటీ మన అరటిక వ్యవస్థ  మనకు అర్ధం కావట్లేదు దేశానికి ఎం చెపుగతాం చెప్పండి  ఇక యువత మార్గ .........  అబ్బ టైపు  చేయాలి అంటె  నే బద్ధకం అనిపిస్తుంది ఇంకా నేనేం చేప్తనండి
   


ఇంతకీ నీ బాద ఏంటి మమ్మల్ని ఎందుకు ఇలా వేపుకు తింటున్నవ్ అని అనుకుంటునార  ఏమి లేదు అండి  ఏదో అందరి బ్లాగ్ లు చదివి మనము ఓ బ్లాగ్ రాద్దాం అని అనుకొవడం  మొదలు ఇక్కడకోచి ఏదో ఒకటి రాద్దాం అని అనుకోని స్టార్ట్  చేశా కానీ ఆ తర్వాత అర్ధం ఐంది చదివిన అంత  ఈజీ  కాదు రాయడం అని మొదలు పెట్టాక కానీ అర్ధం కాలేదు.  ఐన ఓటమి ఒప్పుకోవడం  మన  హిస్టరీ లో లేదు


అందుకే మీకు ఏదో ఒకటి చెప్పాలని ఫిక్స్ అయ్యా చెప్పి తీరుత

                               అన్న అని పిలవదేల 
మా అమ్మ వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెలు.   అందులో మా చిన్న పిన్ని కి ఒక పాపా మొన్నీమధ్య  పుట్టింది కానీ
అది పుట్టగానె మా వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయింది పాపం వాళ్ళకు మాత్రం ఎం తెలుసు వాళ్ళ ఆనంద పడేది ఆ కొద్ది రోజులు మాత్రమెయ్ అని ......
ఆ  తర్వాత ఒక 6 నెలల వర కు బాగానే  ఉంది ఆ తర్వాత మా కుటుంబానికి హోల్ సేల్ గా ఒక ఫిసికల్ ట్రైనర్ దొరికింది మా  ఇంట్లో అందరు కొంచెం లావు (హ హహ హ నాతొ సహా )ఒక్క మా చిన్న పిన్ని తప్ప అది తానెమో 
ఉద్యోగ రిత్య ఆఫీసు కు వెళ్ళిపోయేది  .  అందుకని పాపా బాద్యతలు మా అమ్మమ మరియు మా అమ్మ చూసుకొనెవరు 
మా అమ్మ కు అసలే బద్ధకం ఎక్కువ.  ఎంతైనా నా తల్లి కదా ఆ మాత్రం ఉంటుంది లెండి  

 ఇంతకీ అసలు విషయం  ఏమిటి అంటే మొన్ని ఈ మద్యె దానికి మాటలు రావడం మొదలు అయ్యాయి 

అది  ముద్దుగా అమ్మ   అంటూ ఉంటె కన్న మా పిన్నీ కాదు విన్న అందరం ఆనదం  లో తెలిపోయం ఆ తర్వాత మెల్లిగా  అందరిని పలకరించడం మొదలెట్టింది  ఇలా మెల్లిగా అందరిని పిలుస్తుఉంటె  మా వాళ్ళ ఆనందం అంత  ఇంత  కాదు ...... 

ఇలా జరిగిన కొద్ది రోజులకు నాకో అనుమానం వచ్చింది ఇది అందరిని పిల్స్తోంది కాని నన్ను మాత్రం అన్న అని పిలవట్లేదు  అదీ ఏంటో ఎన్ని సార్లు అనవేయ్ అని బతిమాలిన  కోప్పడిన ఎం చేసిన అస్సలు అనట్లేదు 


ఆతర్వాత ఇంకా లోతుగా అలోచిస్తే అర్ధం ఐన విషయం  ఏమిటి అంటే  అది మొగవాళ్ళను మాత్రమె పిలవడం లేదు అని (వాళ్ళ నాన్న కూడా నా లాగె  ప్రయత్నాలు చేసి విఫలం  అయ్యాడు లెండి) అదేంటో మరి నేను ఎన్ని  ప్రయత్నాలు చేసిన  పిలవనిది అత్తింట్లో ఉన్న మా అక్క ను మాత్రం రోజుకి 300 ల సార్లు కలవరిస్తుంది 


ఇంకా మనల్ని  ఇది పిల్వదు అని నేను ప్రయత్నాలు వదిలేసి హైదరాబాద్ వచేసాక మా వూరి నుండి అమ్మ ఫోన్ 

"నిన్ను అన్న అంది రా అని"
అదేంటో అది అన్న అని పిలవనందుకు బాధ పడనినేను 
అది పిలిచినందుకు ఆనంద పడ్డాను.  మనకు నచిన వాళ్ళు మనల్ని పలకరించనప్పుడు  కలిగే  బాధ  కన్నా 
పలకరించినప్పుడు కలిగే సంతోషం వేరు  అదేంటో మరి  ఎప్పుడైనా బాధ సంతోషాన్ని DOMINATE  చేస్తుంది కదా అని నాకు నేను ప్రశ్న వేసుకున్న ఐన సమాధానం మాత్రం ఆలోచించలేదు ఎందుకంటీ నాకు ఈ  నిమిషం నేను అనుబవిస్తున్న సంతోషం చాలు  .ఆసలు ఆలోచించాలి అని కూడా లేదు 
అంతే కొన్నింటికి  ఎందుకు అని తర్కిస్తే సమాదాహనం దొరకదు అప్పుడు తర్కించడం మనేయ్యడం   మేలు అందుకీ నేను మానేస.... 
ఎప్పుడైనా బాధ  లో ఉన్న జీవితాన్ని బ్రతకండి సంతోషం లో గడిపే క్షణాల్ని  జీవించండి 
బ్రతకడానికి జీవించడానికి గల తేడా మీకు  తెలుసు అనుకుంట మరి ఇక నేను ఉంటా .....................

1 కామెంట్‌:

  1. ఆ తర్వాత ఒక 6 నెలల వర కు బాగానే ఉంది ఆ తర్వాత మా కుటుంబానికి హోల్ సేల్ గా ఒక ఫిసికల్ ట్రైనర్ దొరికింది మా ఇంట్లో అందరు కొంచెం లావు (హ హహ హ నాతొ సహా )

    super lines.....

    రిప్లయితొలగించండి