manchi muchatlu

16, మే 2015, శనివారం

naa comedy kashtaalu

                                       నా కామెడి కష్టాలు 

ఏంటో నండి  ఈ మద్యలో అన్ని జీవితం గురించి నాకు నచ్చని  కోణాల గురించి ఇలా అన్ని పోస్ట్టుల్లోను  ఫిలాసఫీ  ఎక్కువైంది అని మా ఇంట్లో వాళ్ళు అందరు తిడుతున్నారు . మా అక్క ఫోన్ చేసి "ఒరేయ్  ఎదవ నీకు ఏమైంది రా ఏదన్న నవ్వుకోడానికి  రాయి.  అంతే గాని  నీ తోక్కోలో ఫిలాసఫీ తో ఎడిపిస్తవా  అంటూ తిట్టిన తిట్లని మల్లి మల్లి తిట్టినది  (అంటే పాపం దానికి తిట్లు రావు లెండి  అందుకీ వచ్చిన రెండితోనే అడ్జుస్ట్  అయిపోయా )
  ఇక ఆ తర్వాత నాకు కూడా ఏడుపు వచ్చి జనాలు నవ్వుకోడానికి  ఏదైనా రాద్దాం అని డిసైడ్ అయ్యా.   ఐన మనకు కామెడీ రాయడం రాదు వద్దురా బాబు నా లోపల  ఉన్న నా ఇంకోడు చెప్తునే ఉన్నాడు ఐన సరే  నేన్ commit  అయ్యాక  నేను  వినను  అని వాడి తో చెప్దాం అనుకున్న కానీ మనకు మహేష్ బాబు అంత  సీన్ లేదు అని దానికి కూడా తెలుసు కాబట్టి ఆ డైలాగ్  వాడలేదు అందుకే  అన్ని మూసుకొని లాప్టాప్ తెరిచి ఎం రాద్దామ అని ఆలోచిస్తూ కూర్చున్న
ఇక ఆ తర్వాత మొదలయ్యాయి నా కామెడీ కష్టాలు ఎలా రాయాలి ఎం రాయాలి ఎం అర్ధం కావడం లేదు
అప్పుడు నాకు అర్ధం అయ్యింది కామెడీ రాయడం లో ఉన్నంత ట్రాజెడీ ఇంకో దేంట్లోనూ  లేదని అప్పుడు నేను కూడా పవన్ కళ్యాణ్ లాగ పంచ్ ల కోసం  కనిపించని శత్రువు తో వినిపించని యుద్ధం చేశా .. అసలు ఎం  రాయాలో తెలిదు
ఎదురుగ లాప్టాప్  చేతితో టైపు చేద్దాం అంటే మెదడు లో ఎం లేదు కానీ గుండెల నిండా కామెడీ రాయాలన్న ఆశ తప్ప (ఈ డైలాగ్ మొత్తం పవన్ కళ్యాణ్ జనసేన స్పీచ్ ఫీల్ తో చదవండి please.....నా కోసం  )
ఎంత కష్టపడ్డ  నాకు కామెడీ రావడం లేదు కామెడీ ఎలా రాయల అని గూగుల్ లో టైపు చేశా (నాకు ఎం రాకున్న గూగుల్ ని అడగడం అలవాటు ) అదేంటో అది కొన్ని 100ల కొద్ది సమాధానాలు ఇచ్చింది కానీ నాకు కావల్సింది మాత్రం దొరకలేదు  అప్పుడు నాకో మెరుపు లాంటి ఆలోచన వచ్చింది కాసేపు కామెడీ ని పక్కకు పెట్టి అస్సలు గూగుల్ కి తెల్యని విషయాలు ఎమన్నా ఉన్నాయా అని టైపు చేశా అప్పుడు కూడా కొన్ని 100ల కొద్ది ఆన్సర్స్  ఇచ్చింది  .. ఇక నా ఓపిక నశించింది  లాప్టాప్ ని చూస్తె దయ్యం ల కనిపించింది అంతే వెంటనీ అన్ని క్లోజ్  చేసి ఓ పావుగంట ఏడ్చా .  కాస్త తేరుకున్నాక మా అక్క కు ఫోన్ .  చేసి  ఇక  కామెడీ రాయడం నా  వాళ్ళ కాదు నేను నాకు వచ్చిందే  రాస్తా అని  చెప్పా అప్పుడు మా అక్క నువ్వేం రైటర్ వి అవుతావ్ రా రైటర్  అంటే అన్ని రాయాలి అని నాకో  గంట  సేపు క్లాసు తీసుకుంది  btech  క్లాసు లే విన్నవాడిని నాకు ఇవో  లెక్క ..  జనాలు ఏమనుకుంటారు ర అని  మా అక్క అంటే చంటబ్బాయి లో  శ్రీ లక్ష్మి   లాగ నేను  కవి ని కాదన్నవాన్ని కత్తి  తో పొడుస్త అని  కవిత అందుకున్న  వెంటనీ మా అక్క కు దాన్ని పోడుస్తానేమో అనీ డౌట్  వచ్చి పెట్టేసింది  ఫొన్....
సో ఇంతకీ నేన్ చేపచ్ది ఏమిటి ఎ మనకి రానిది మనం చేయకూడదు.  అందుకె  మీకు జస్ట్ నా కష్టాలు చెపుదాం అని ఈ పోస్ట్ పెట్ట ప్లీజ్ ఇక నా నన్ను కామెడీ రాయమని అడగకండి ఒక వేల అడిగిన నేన్ రాయలేను అనీ విషయం  మీకు ఈ పాటికే  అర్ధం  అయ్యి ఉంటుంది  .  సో నేన్ రాయలేకున్న నన్ను రైటర్ గానే బావించండి లేక పొతే 

గుర్తు ఉంది గా మా పిన్ని లాంటి శ్రీ లక్ష్మి గారి లాగా నేను మిమ్మల్ని పొడుస్తా రాళ్ళతో కొడుత (హెయి  మరి   సీరియస్  గా తీసుకోకండే  ప్లీజ్ నాకు తెల్సు మీరు తీసుకోరు  మీరు చాల మంచోల్లుగా  ) ఇవీ  నా కామెడీ కష్టాలు ..   సరే మరి మల్లి కలుద్దాం 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి