manchi muchatlu

30, సెప్టెంబర్ 2015, బుధవారం

manchi chedu(unnaya)

                                               మంచి చెడు (ఉన్నాయా)

ఈ ప్రపంచం లో ఎవైన శాశ్వతం  అనుకుంటే  అవి "మంచి చెడు"  .  ఈ రెండు  పదాలు చాల చిన్నవి గా కనిపిస్తాయి  మరియు వినిపిస్తాయి  కాని  ఇవి చాల పెద్దవి.   వీటిని  సరిగ్గా తెలుసుకోగలిగితే  మీ అంత  గొప్పవాడు ఎవరు ఉండరు అని చాల మంది వాదన ....  కాని ఏది మంచి ఏది చెడు అని ఎలా తెల్సుకోవలో ఎవడుచెప్పలేదు కొంతమంది చెప్పిన  వాళ్ళ మంచి కోసం చెప్పుకున్నవే ఎక్కువ  .

 ఉదాహరణకి  మాంసం తింటే బలం అని మనకి చిన్నతనం నుండి నూరిపోస్తున్నారు అంతే అది మంచి అని వీళ్ళ వాదన  సరిగ్గా  ఇటు పక్క శాకాహారులు అందరు అమాయకమైన మూగ జంతువులను చంపుతున్నారు అని అంటున్నారు మరి వీళ్ళు చెప్పేది వాస్తవమే కదా . ఇప్పుడు ఇదే ఉదాహరణ ని ఇంకో  కోణం లో చూద్దం .  అదొక  ఎడారి  ప్రాంతం  అక్కడ  చెట్లు ఏమి లేవు  అస్సలు  మన మంతెన  సత్యనారాయణ రాజు గారు చెప్పే fooddu    ఏది లేదు  ఒక్క ఒంటెలు తప్ప అప్పుడు మన పరిస్తితి ఏంటి చచ్చినట్టు మాంసం తినాల్సిందే  కదా లేక పొతే మనంచస్తాం సో, నేను చేపోచేద్ది  ఏమిటి అంటే  ప్రపంచం లో మంచి చెడు అని ఏవి లేవు ఉన్నది  మన అవసరం మాత్రమే  మన అవసరం మనల్ని ఎటు మళ్లిస్తే అటు వెళ్ళడమే . ఒకడి మంచి  ఇంకోడికి  చెడుఅవుతుంది అంతే మంచి సంతోషాన్ని  ఇస్తే చెడు దుక్కాన్ని ఇస్తుంది   అంటే  ఒక ఆట అడితే ఒకరు గెలుస్తారు ఇంకొకరు ఒడాతారు  ఒకడికి మంచి జరిగింది ఇంకోడికి చెడు జరిగింది అంతే . అంటే సంతోషం కలిగితె మంచి  బాధ కలిగితే చెడు అంతే మన మనుషుల ప్రకారం . అంతే  కాని  మంచి కి చెడు కి వీరీ గొప్ప అర్ధాలు ఏమి లేవు   

అంటే మంచి  చెడు ఎలాగు లేదు అన్నాడు కదా వీడు అని  మర్డర్ లు మానబంగాలు చేసుకోడానికి మనకు ఓ వాదన దొరికింది అనుకుంటున్నారా దీనికి ఒక  మెలిక ఉంది మంచి చెడు లేదు అన్న గాని ఏవి ఉన్నాయో ఈ  ప్రపంచం లో మీకు చెప్పలేదు కదా ఈ ప్రంపంచం లో ఉన్నది ఉండాల్సింది న్యాయం  అన్యాయం  ఈ రెండు మాత్రమె . ఉండాలి   పైన  చెప్పిన ఉదాహరణ  తీసుకుంటే  మనకు శాకాహారం అందుబాటులో ఉన్నపుడు  కూడా మాంసాహారం తినడం  అన్యాయం  ఎందుకంటే వాటికి కూడా బ్రతికే  హక్కు ఉంది కాబట్టి  . మాంసాహారం అదీ  తప్ప ఇంకోటి లేదు అనుకున్నపుడు  తినడం వేరు  అప్పుడు అది న్యాయం కాకపొఇన అన్యాయం మాత్రం కాదు . 

న్యాయం మనకి ఆనందం కలుగచేస్తుంది మానసిక తృప్తిని ఇస్తుంది ఇంతకంటే ఎం కావలి మనిషికి . న్యాయమే నీకు మంచి ఇదీ నీకు సుకాన్ని సంతోషాన్ని ఇస్తుంది . అందరు న్యాయం గా ఉండండి  హాయి గా ఉండండి ఎక్కువ కాలం బతకండి .... . . . . . . . . . . . . . . . . . ... . . . . . . . . .. . . . 



అల్ల్ ధీ బెస్ట్ . . . . . . . . . . . . . . . .  . . . . 

19, జులై 2015, ఆదివారం

repati vela nirasha

                                             రేపటి వేల నిరాశ 

నిరాశ నిలువెత్తు  రూపం లో తలుపు తలుపుతడుతుంటే 
ఆశలు ఆశ్రవులై నేల  రాలతుంటే 
 
తెల్యని గమ్యం కోసం నిరీక్షిస్తుంటే 
నిరాశ నిలువెత్తు రూపం లో తలుపు తడుతుంటే 
ఆశలు అశ్రువులై నెల రాలుతుంటే 
 
తెల్యని గమ్యం కోసం పరుగెడుతుంటే 
మాటల తూటాలు అడ్డం పడుతుంటే 
ఆశలను ఆశ్రవులుగా మారుస్తుంటే 
అశ్రువులు మనసులను మెలిపెడుతుంటే 
మనుషలపై నమ్మకం సన్నగిల్లుతుంటే 
రేపటి వేల ఎం అవుతుందా అని అనుమానం కలుగుతుంటే
కళలు కనుమరుగవుతుంటే
నేను   ఒంటరినవతుంటే
 సమాజం బయపెడుతుంటే
 
 నిరాశ నిలువెత్తు  రూపం లో తలుపు తలుపుతడుతుంటే
ఆశలు ఆశ్రవులై నేల  రాలతుంటే
నా బ్రతుకేనా నేను  బ్రతుకున్తున్నది అని అనుమానం వస్తుంటే
సమాజం తో సంగర్షణ పడుతుంటే నేను  ఓడిపోతుంటే
రేపటి వేల నేను  ఉంటాన అని అనుమానం కలుగుతుంటే
ఆ ఆలోచనకు నేను నవ్వుతూ  కళ్ళు మూసుకుంటే


నిరాశ నిలువెత్తు  రూపం లో తలుపు తలుపుతడుతుంటే 
ఆశలు ఆశ్రవులై నేల  రాలతుంటే 
 
 

16, మే 2015, శనివారం

naa comedy kashtaalu

                                       నా కామెడి కష్టాలు 

ఏంటో నండి  ఈ మద్యలో అన్ని జీవితం గురించి నాకు నచ్చని  కోణాల గురించి ఇలా అన్ని పోస్ట్టుల్లోను  ఫిలాసఫీ  ఎక్కువైంది అని మా ఇంట్లో వాళ్ళు అందరు తిడుతున్నారు . మా అక్క ఫోన్ చేసి "ఒరేయ్  ఎదవ నీకు ఏమైంది రా ఏదన్న నవ్వుకోడానికి  రాయి.  అంతే గాని  నీ తోక్కోలో ఫిలాసఫీ తో ఎడిపిస్తవా  అంటూ తిట్టిన తిట్లని మల్లి మల్లి తిట్టినది  (అంటే పాపం దానికి తిట్లు రావు లెండి  అందుకీ వచ్చిన రెండితోనే అడ్జుస్ట్  అయిపోయా )
  ఇక ఆ తర్వాత నాకు కూడా ఏడుపు వచ్చి జనాలు నవ్వుకోడానికి  ఏదైనా రాద్దాం అని డిసైడ్ అయ్యా.   ఐన మనకు కామెడీ రాయడం రాదు వద్దురా బాబు నా లోపల  ఉన్న నా ఇంకోడు చెప్తునే ఉన్నాడు ఐన సరే  నేన్ commit  అయ్యాక  నేను  వినను  అని వాడి తో చెప్దాం అనుకున్న కానీ మనకు మహేష్ బాబు అంత  సీన్ లేదు అని దానికి కూడా తెలుసు కాబట్టి ఆ డైలాగ్  వాడలేదు అందుకే  అన్ని మూసుకొని లాప్టాప్ తెరిచి ఎం రాద్దామ అని ఆలోచిస్తూ కూర్చున్న
ఇక ఆ తర్వాత మొదలయ్యాయి నా కామెడీ కష్టాలు ఎలా రాయాలి ఎం రాయాలి ఎం అర్ధం కావడం లేదు
అప్పుడు నాకు అర్ధం అయ్యింది కామెడీ రాయడం లో ఉన్నంత ట్రాజెడీ ఇంకో దేంట్లోనూ  లేదని అప్పుడు నేను కూడా పవన్ కళ్యాణ్ లాగ పంచ్ ల కోసం  కనిపించని శత్రువు తో వినిపించని యుద్ధం చేశా .. అసలు ఎం  రాయాలో తెలిదు
ఎదురుగ లాప్టాప్  చేతితో టైపు చేద్దాం అంటే మెదడు లో ఎం లేదు కానీ గుండెల నిండా కామెడీ రాయాలన్న ఆశ తప్ప (ఈ డైలాగ్ మొత్తం పవన్ కళ్యాణ్ జనసేన స్పీచ్ ఫీల్ తో చదవండి please.....నా కోసం  )
ఎంత కష్టపడ్డ  నాకు కామెడీ రావడం లేదు కామెడీ ఎలా రాయల అని గూగుల్ లో టైపు చేశా (నాకు ఎం రాకున్న గూగుల్ ని అడగడం అలవాటు ) అదేంటో అది కొన్ని 100ల కొద్ది సమాధానాలు ఇచ్చింది కానీ నాకు కావల్సింది మాత్రం దొరకలేదు  అప్పుడు నాకో మెరుపు లాంటి ఆలోచన వచ్చింది కాసేపు కామెడీ ని పక్కకు పెట్టి అస్సలు గూగుల్ కి తెల్యని విషయాలు ఎమన్నా ఉన్నాయా అని టైపు చేశా అప్పుడు కూడా కొన్ని 100ల కొద్ది ఆన్సర్స్  ఇచ్చింది  .. ఇక నా ఓపిక నశించింది  లాప్టాప్ ని చూస్తె దయ్యం ల కనిపించింది అంతే వెంటనీ అన్ని క్లోజ్  చేసి ఓ పావుగంట ఏడ్చా .  కాస్త తేరుకున్నాక మా అక్క కు ఫోన్ .  చేసి  ఇక  కామెడీ రాయడం నా  వాళ్ళ కాదు నేను నాకు వచ్చిందే  రాస్తా అని  చెప్పా అప్పుడు మా అక్క నువ్వేం రైటర్ వి అవుతావ్ రా రైటర్  అంటే అన్ని రాయాలి అని నాకో  గంట  సేపు క్లాసు తీసుకుంది  btech  క్లాసు లే విన్నవాడిని నాకు ఇవో  లెక్క ..  జనాలు ఏమనుకుంటారు ర అని  మా అక్క అంటే చంటబ్బాయి లో  శ్రీ లక్ష్మి   లాగ నేను  కవి ని కాదన్నవాన్ని కత్తి  తో పొడుస్త అని  కవిత అందుకున్న  వెంటనీ మా అక్క కు దాన్ని పోడుస్తానేమో అనీ డౌట్  వచ్చి పెట్టేసింది  ఫొన్....
సో ఇంతకీ నేన్ చేపచ్ది ఏమిటి ఎ మనకి రానిది మనం చేయకూడదు.  అందుకె  మీకు జస్ట్ నా కష్టాలు చెపుదాం అని ఈ పోస్ట్ పెట్ట ప్లీజ్ ఇక నా నన్ను కామెడీ రాయమని అడగకండి ఒక వేల అడిగిన నేన్ రాయలేను అనీ విషయం  మీకు ఈ పాటికే  అర్ధం  అయ్యి ఉంటుంది  .  సో నేన్ రాయలేకున్న నన్ను రైటర్ గానే బావించండి లేక పొతే 

గుర్తు ఉంది గా మా పిన్ని లాంటి శ్రీ లక్ష్మి గారి లాగా నేను మిమ్మల్ని పొడుస్తా రాళ్ళతో కొడుత (హెయి  మరి   సీరియస్  గా తీసుకోకండే  ప్లీజ్ నాకు తెల్సు మీరు తీసుకోరు  మీరు చాల మంచోల్లుగా  ) ఇవీ  నా కామెడీ కష్టాలు ..   సరే మరి మల్లి కలుద్దాం 


10, మే 2015, ఆదివారం

neeku teelida

                                                  నీకు తెలీద 

   నీకు తెలీద  అమ్మ 

నన్ను వదిలే క్షణం 

నా దైర్యం పై పై దని 

నీకు తెలీద  అమ్మ 

నువ్ లేని ఈ చీకటి అంటే  బయమని 

నీకు తెలిద అమ్మ నువ్ లేని ఈ ప్రంపంచం అంటే  బయమని 

                                                                         

                                                                         ఐన ఎలా వదిలావ్ నన్ను 

నాన్న నన్ను చదువు కోసం వదిలాడు 

కానీ నువ్ ఎలా వదిలావ్ 

 

నీకు తెలీద అమ్మ 

నువ్ లేని ఈ  చదువు అంటే  బయమని 

నీకు తెలీద  అమ్మ 

నువ్ లేని ఈ జేవితం అంటే  బయమని 

నీకు   తెలీద అమ్మ  నా దైర్యం పై పై అని 

నీకు తెలిద అమ్మ నువ్వే  ఆ దైర్యం అని 

 

నీకు తెలిద అమ్మ 

నేన్ నీకోసం నేను  ఏడుస్తానని 

నీకు తెలీద  అమ్మ 

నేన్ నీకోసం నేను  ఆలోచిస్తానని 

నీకు తెలీద  అమ్మ 

నేనే నువ్వని 

 

                                                                     ఐన ఎలా వదిలావ్ 

 

అవును ఎక్కడ వదిలావ్ 

నా కన్నుల్లో కన్నీరై ఉన్నావ్ 

అందుకే  రానివట్లేదు  వస్తే  వదిలి వెళ్తావ్ అని 

నా పేదల పై నవ్వు వై ఉన్నావ్ 

అందుకీ దాన్ని ఎప్పుడు వదలట్లేదు 

నా గుండె  లోతుల్లో ఉన్న తడివి అయి ఉన్నావ్

అది ఎంత మంది తవ్విన నువ్ అలనే ఉంటావ్  ఉంటావ్ ......... 

 

                                                                       ఐన నీకు ఇవ్వని తెలిద అమ్మ ....................... 

 

                  FINALLY  HAPPY  MOTHERS  DAY  AMMA 

                                     

19, ఏప్రిల్ 2015, ఆదివారం

jeevitam

                                            జీవితం

జీవితం ఈ నాలుగక్షరాల గురించి చాల మంది చాల చెప్పారు మల్లి  నేను కొత్త  గా చెప్పేదేముంది . మరి కొత్తది లేనప్పుడు 
ఎందుకు ఈ పోస్ట్ అంటారా ఒక్కో సారి పాతవీ బాగుంటాయి  కాబట్టి అందుకే మందు కూడా పాత పాతపడితే నే కిక్ వస్తుంది వీడేంటి ఏదో మంచి విషయం  చెప్తాడు  అని అనుకుంటే మందు గిందు అంటున్నాడు అనుకుంటునార అంటే 
ఎవరికీ అర్ధమయ్యే examples వాళ్ళకి ఇవ్వాలని అని అళ ఇచ్చ అన్నమాట 
     
  సరే ఇంతకీ ఈరోజు మనం జీవితం గురించి మాట్లాడుకుందాం అసలు జీవితం అంతే ఏంటి అమృతం సీరియల్ పాట లో గుణ్ణం గంగరాజు గారు అన్నట్టు" మనం ఈదుతున్నాం ఒక చెంచాడు బవసాగరం" అంతే అది చూడడానికి చేమ్చా అంతే ఉన్న అది ఇంతకు రాని  దరి అలిసిపోఎవరకు ఈదడం కాదు చచ్చిపోఎవరకు ఈధల్సిన  సాగరం 
 అందరు ఈదుతారు కానీ కొందరేయ్ మద్యలో  మునిగిపోకుండా సుకం గా దరికి చేరుతారు ఈదడం వేరు దరికి చేరడం వేరు 
ఈ సముద్రం లో ఈదాడానికి మనకు ఇద్దరు  trainers  ఉంటారు అమ్మ నాన్న వీల్లు  మనకు మన చేతుల్ని కాళ్ళని  ఉపయోగించి ఈదడం(జీవించడం) నేర్పిస్తారు ఒక్కకరిది ఒక్కో తరహ training 
కాని ఈ సముద్రం దాటడానికి వీళ్ళ ట్రైనింగ్ చాల ఇంపార్టెంట్ . మన ఈత చాల మట్టుకు  వీల పైన ఆదారపడి ఉంటుంది వీలు మనల్ని సగం దూరం బాగానే ఈదిస్తారు కాని ఆ తర్వాత బాగా ఈదండి అని  ప్రెషర్ పెడతారు ఒక్కో సమయం లో అది వాళ్ళ ఈతొ మన ఈతొ అర్ధం కాదు కానీ అది ప్రేమ తో చీసేది కాబ్బట్టి మనం ఎం చేయలేం 
ఒక గజ ఈతాగాడు(sucessfull  person )నాకు చెప్పాడు  మీరు సముద్రాన్ని బాగా ఈదరు కదా ఎలా ఈదరు మీకు అంట బాగా training  ఎలా ఇచ్చారు అంటే  నన్ను మా వాళ్ళు డైరెక్ట్ గా సముద్రం లో తోసేసి నీకు నచినట్టు  ఈదు  అన్నారు అల అల నాకు నేనే ఈత నేర్చుకొని గజ ఈతగాడిని అయ్యాను అని అన్నాడు  
సో అమ్మ నాన్న మా మీద ఉన్న ప్రేమ తో మమ్మల్ని మా తరహ జీవితం  కాకుండా మీ తరహ జీవితం జీవించడానికి encourage   చేయకండి . మా తరహ జీవితాన్ని ఇవ్వండి అందులో ఎవన్న  తప్పులు చెస్తే  సరి చేయండి.  
ప్రేమ ఉంటె దారి లో ముళ్ళు తీయండి కాని ముళ్ళు ఉన్నాయ్ కదా అని  దారినీ వదిలేయమనకండి అది పిరికి తనం అవుతుంది 
ఇంకా కొందరు అమ్మ నన్ను మేం డాక్టర్ కలేకపోయం మా వాడు కావలి  మీ కోరిక మీకు తీరలేదు మీకు ఆ బాద ఉంది ఒక వేల మీ పిల్లలు మీరు చెప్పినట్టు జీవితాన్ని గడిపితే  అదే బాద కొన్ని రోజుల తర్వాత మీ పిల్లలు కూడా పడతారు అని మర్చిపోకండి  and  plz  "సమాజం ఏమనుకుంటుంది " అనీ డైలాగ్ నీ మర్చిపోండి  మనం వాళ్ళ కోసం జీవితాన్ని గడపడం లేదు 
సారీ నా సొల్లు తో మీకు బోర్ కొట్టిస్తే  దీని వాళ్ళ ఒక్కరు మారిన సంతోషమే 

15, ఏప్రిల్ 2015, బుధవారం

naaku nachani konaalu

నాకు నచ్చని కోణాలు 

 నాకు కొందరి లో కొన్ని కోణాలు అస్సలు నచ్చవండి . నీకు నచ్చకపోతే  మాకేంటి అనకండి ఇది కూడ  నాకు నచ్చదు పూర్తి విషయం  వినండి  వినకుండానే ఎందుకు ఆల  ఆపేస్తారు .నాకు నచ్చనివి మీకు నచ్చకపోవచ్చు  .నా ఆలోచనలు మీకు నిజమే  అనిపించచ్చు దీని వల్ల మీరు మారొచ్చు ఒక వేల నా ఆలోచనీ తఫైతే  (మీ కామెంట్  ల తో )
ఇక  విషయం లో కి వేలితే నాకు కొన్ని సార్లు కొంతమంది  నచ్చరండి అది వాళ్ళు నా మంచి కోసం చెప్పిన లేదా వాళ్ళ మంచి కోసం చెప్పుకున్నా .  అందులో  ఒకటి
ఒక సారి ఒక ఫ్రండ్ (జిమ్ ఓనర్ వీడు)  కలిస్తె  జిమ్ గురించి  టాపిక్ వచ్చి నేను cazual  గా  టాపిక్  వచ్చి  "జిమ్ కి
వేలితే సన్నబడతార"  అని అడిగా దానికి వాడు  నీకు బద్ధకం ఎక్కువ  నీకు అంత  సీన్ లేదు నీకు తాగ్గాలని అని ఉంటె ఎప్పుడో వచేవడివి  అని ఒక తిట్ల దండకం అందుకున్నాడు
 నాకో విషయం  అర్ధం కాదు  ఒక కస్టమర్ వచ్చి  ఇదే అదిగితెయ్  ఎం సమాధానం చెప్తాడు చాల ఓపికగా "సార్  ఇది   చెస్తే ఇంత  తగ్గుతారు అని లెక్కలు వీసి మరి చెప్పుతారు అదేంటో మరి నేను అడిగేసరికి అల మాట్లాడాడు వాడేదో స్నేహం లో ఉన్న
చనువు తో అల మాట్లాడాడు అని మీరు అంటారు కాని ఆ మాటలు పడ్డవాడికి కదా తెలిసేది 
అదేంటో వీళ్ళు  మన అనుకోని మాట్లాడతారో లేక వీళ్ళు డబ్బులు ఇవ్వరని అని ముందే  అనుకోని మాట్లాడతారో అర్ధం కాదు 
అందుకీ మీరు కూడా పక్క వాళ్ళని బాధ  పెట్టకూడదు  అంటె  ముందు అందరిని ఒకే దృష్టి తో చూడడం మొదలు పెట్టండి
అప్పుడు మనుశలకు  మీ మీద గౌరవం పెరుగుతుంది నిజం గా ప్రేమ తో పాటు గౌరవం  ఉన్నపుడే ఆ బంధం నిలకడ గా ఉంటుంది  ఇక్కడ గౌరం అంతే అందరిని " ఏవండి " అనో "గారు"అనో పిలవడం కాదు అల పిలవడం మర్యాద
గొవరనికి మర్యాద కి తేడా  ఉంది .  ప్రేమ లో గౌరవం అంటే మనిషికి గౌరవం ఇవ్వడం కాదు అతని మనసు కి అతని ఆలోచనలకి ఇవ్వడం  ఇక  అందుకీ మీరు ప్రేమించే మనిషి కి గౌరవం ఇవ్వకున్నా పర్లేదు కాని మనిషి మనసు కి ఆలోచనలకి వ్యక్తిత్వానికి 
గౌరవం  ఇవ్వండి ఇదీ ఆ బంధాన్ని నిలబెడుతుంది ఇది అన్ని బందాలకి వర్తిస్తుంది అంతే తల్లితండ్రులకి పిల్లలకి కావచ్చు
ప్రేమికులకి కావచ్చు చివరికి స్నేహితులకి కూడా కావచ్చు
ఇదంతా ఓపిక గ చదివినందుకు థాంక్స్   మీకు ఒక వేల నా వాదన తప్పు అనిపిస్తె pls  కామెంట్ 

 

 

 

 

4, ఫిబ్రవరి 2015, బుధవారం

moguds vs pellams

మొగుడుస్  vs పెళ్లాంస్   
అదేంటో నండి  ప్రపంచం లో ఈ టాపిక్ పై కొన్ని రోజులు మాట్లాడమన్న మాట్లాడతారు జనాలు 
ఎవరు    గొప్ప అనీ విష్యం పై ఎప్పుడు చర్చే . గుడ్డు ముంద లేక కోడి ముంద  అనీ ఎంత పెద్ద ప్రశ్నో 
ఈ రెండు జాతుల్లో ఏది గొప్పదో చెప్పడం కొంచెం కష్టం అందుకే నేను దీనికి తెర దించుతూ నా అలోచల్ని చెప్పాలని ఫిక్స్ అయ్యా ....... మీరు వద్దు అన్న సరే 


స్టెప్ బై స్టెప్ వెలితీ ఈ మొగుడు  పెళ్ళాం అనీ కాన్సెప్ట్ పెళ్లి తో మొదలు అవ్వుధీ 
అందుకీ అక్కడి నుండీ వద్దాం  ఏ తండ్రి ఐన తన కంటి గొప్ప వాడినీ అల్లుడి గా తెచుకోవాలని అనుకుంటాడు.  అది సహజం  అలగేయ్ పెళ్లి కూతురు  కూడా తనకంటె  అందగాడు   తనకంటే బాగా సంపాదన ఉన్నవాడు తన కంటి బాగా చదువు కున్నవాడు  తన్న కంటి ఎత్తు ,జుట్టు, ఇంకా ఇంకా అనీ తన కంటి బాగా ఉన్నవాడినే  కోరుకుంటుంది  సో ఈ  లెక్కన తన కంటే  గొప్ప బర్త  ను ఎంచుకొని మల్లి అతని తో సమాన హక్కుల కోసం పోరాడడం ఎంత వరకు సమంజసమో  తెలివి కళ్ళ  వాళ్లైన వాళ్ళకీ తెలయాలి  సో  ఆడవాళ్ళూ అండ్ పెళ్ళాలు  ఈ సూత్రం ద్వార నీ చేపోచేది ఏమిటి  అంతే మీరు మా కంటి తక్కువే 
అందుకీ ఇంకోసారి దీని తర్కించి కష్టపడకండి ............. 



అమ్మ ,అక్క please  and  అల్ ఆడవాళ్ళూ మరి personal  గా తీసుకోక వదిలేయండి (నన్ను)

anna ani pilvadela....??

ఏంటో  అందరి బ్లాగ్ లు చదివి ఏదో ఉత్చాహం తో బ్లాగ్ రాద్దామని మొదలు పెట్ట కానీ ఎం రాయాలో ఎలా రాయాలో 
తెల్యట్లేదు.  ఏంటో నా ఆలోచనలు అని పేరు చూసి దేశ ఆర్థిక వ్యవస్థ మీదో లేకపోతే  యువత మార్గ నిర్దేషలో ఇలాంటివి అనుకునేరు మనకు అంత చిత్రం లేదులెండి  ఎందుకంటీ మన అరటిక వ్యవస్థ  మనకు అర్ధం కావట్లేదు దేశానికి ఎం చెపుగతాం చెప్పండి  ఇక యువత మార్గ .........  అబ్బ టైపు  చేయాలి అంటె  నే బద్ధకం అనిపిస్తుంది ఇంకా నేనేం చేప్తనండి
   


ఇంతకీ నీ బాద ఏంటి మమ్మల్ని ఎందుకు ఇలా వేపుకు తింటున్నవ్ అని అనుకుంటునార  ఏమి లేదు అండి  ఏదో అందరి బ్లాగ్ లు చదివి మనము ఓ బ్లాగ్ రాద్దాం అని అనుకొవడం  మొదలు ఇక్కడకోచి ఏదో ఒకటి రాద్దాం అని అనుకోని స్టార్ట్  చేశా కానీ ఆ తర్వాత అర్ధం ఐంది చదివిన అంత  ఈజీ  కాదు రాయడం అని మొదలు పెట్టాక కానీ అర్ధం కాలేదు.  ఐన ఓటమి ఒప్పుకోవడం  మన  హిస్టరీ లో లేదు


అందుకే మీకు ఏదో ఒకటి చెప్పాలని ఫిక్స్ అయ్యా చెప్పి తీరుత

                               అన్న అని పిలవదేల 
మా అమ్మ వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెలు.   అందులో మా చిన్న పిన్ని కి ఒక పాపా మొన్నీమధ్య  పుట్టింది కానీ
అది పుట్టగానె మా వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయింది పాపం వాళ్ళకు మాత్రం ఎం తెలుసు వాళ్ళ ఆనంద పడేది ఆ కొద్ది రోజులు మాత్రమెయ్ అని ......
ఆ  తర్వాత ఒక 6 నెలల వర కు బాగానే  ఉంది ఆ తర్వాత మా కుటుంబానికి హోల్ సేల్ గా ఒక ఫిసికల్ ట్రైనర్ దొరికింది మా  ఇంట్లో అందరు కొంచెం లావు (హ హహ హ నాతొ సహా )ఒక్క మా చిన్న పిన్ని తప్ప అది తానెమో 
ఉద్యోగ రిత్య ఆఫీసు కు వెళ్ళిపోయేది  .  అందుకని పాపా బాద్యతలు మా అమ్మమ మరియు మా అమ్మ చూసుకొనెవరు 
మా అమ్మ కు అసలే బద్ధకం ఎక్కువ.  ఎంతైనా నా తల్లి కదా ఆ మాత్రం ఉంటుంది లెండి  

 ఇంతకీ అసలు విషయం  ఏమిటి అంటే మొన్ని ఈ మద్యె దానికి మాటలు రావడం మొదలు అయ్యాయి 

అది  ముద్దుగా అమ్మ   అంటూ ఉంటె కన్న మా పిన్నీ కాదు విన్న అందరం ఆనదం  లో తెలిపోయం ఆ తర్వాత మెల్లిగా  అందరిని పలకరించడం మొదలెట్టింది  ఇలా మెల్లిగా అందరిని పిలుస్తుఉంటె  మా వాళ్ళ ఆనందం అంత  ఇంత  కాదు ...... 

ఇలా జరిగిన కొద్ది రోజులకు నాకో అనుమానం వచ్చింది ఇది అందరిని పిల్స్తోంది కాని నన్ను మాత్రం అన్న అని పిలవట్లేదు  అదీ ఏంటో ఎన్ని సార్లు అనవేయ్ అని బతిమాలిన  కోప్పడిన ఎం చేసిన అస్సలు అనట్లేదు 


ఆతర్వాత ఇంకా లోతుగా అలోచిస్తే అర్ధం ఐన విషయం  ఏమిటి అంటే  అది మొగవాళ్ళను మాత్రమె పిలవడం లేదు అని (వాళ్ళ నాన్న కూడా నా లాగె  ప్రయత్నాలు చేసి విఫలం  అయ్యాడు లెండి) అదేంటో మరి నేను ఎన్ని  ప్రయత్నాలు చేసిన  పిలవనిది అత్తింట్లో ఉన్న మా అక్క ను మాత్రం రోజుకి 300 ల సార్లు కలవరిస్తుంది 


ఇంకా మనల్ని  ఇది పిల్వదు అని నేను ప్రయత్నాలు వదిలేసి హైదరాబాద్ వచేసాక మా వూరి నుండి అమ్మ ఫోన్ 

"నిన్ను అన్న అంది రా అని"
అదేంటో అది అన్న అని పిలవనందుకు బాధ పడనినేను 
అది పిలిచినందుకు ఆనంద పడ్డాను.  మనకు నచిన వాళ్ళు మనల్ని పలకరించనప్పుడు  కలిగే  బాధ  కన్నా 
పలకరించినప్పుడు కలిగే సంతోషం వేరు  అదేంటో మరి  ఎప్పుడైనా బాధ సంతోషాన్ని DOMINATE  చేస్తుంది కదా అని నాకు నేను ప్రశ్న వేసుకున్న ఐన సమాధానం మాత్రం ఆలోచించలేదు ఎందుకంటీ నాకు ఈ  నిమిషం నేను అనుబవిస్తున్న సంతోషం చాలు  .ఆసలు ఆలోచించాలి అని కూడా లేదు 
అంతే కొన్నింటికి  ఎందుకు అని తర్కిస్తే సమాదాహనం దొరకదు అప్పుడు తర్కించడం మనేయ్యడం   మేలు అందుకీ నేను మానేస.... 
ఎప్పుడైనా బాధ  లో ఉన్న జీవితాన్ని బ్రతకండి సంతోషం లో గడిపే క్షణాల్ని  జీవించండి 
బ్రతకడానికి జీవించడానికి గల తేడా మీకు  తెలుసు అనుకుంట మరి ఇక నేను ఉంటా .....................