manchi muchatlu

30, సెప్టెంబర్ 2015, బుధవారం

manchi chedu(unnaya)

                                               మంచి చెడు (ఉన్నాయా)

ఈ ప్రపంచం లో ఎవైన శాశ్వతం  అనుకుంటే  అవి "మంచి చెడు"  .  ఈ రెండు  పదాలు చాల చిన్నవి గా కనిపిస్తాయి  మరియు వినిపిస్తాయి  కాని  ఇవి చాల పెద్దవి.   వీటిని  సరిగ్గా తెలుసుకోగలిగితే  మీ అంత  గొప్పవాడు ఎవరు ఉండరు అని చాల మంది వాదన ....  కాని ఏది మంచి ఏది చెడు అని ఎలా తెల్సుకోవలో ఎవడుచెప్పలేదు కొంతమంది చెప్పిన  వాళ్ళ మంచి కోసం చెప్పుకున్నవే ఎక్కువ  .

 ఉదాహరణకి  మాంసం తింటే బలం అని మనకి చిన్నతనం నుండి నూరిపోస్తున్నారు అంతే అది మంచి అని వీళ్ళ వాదన  సరిగ్గా  ఇటు పక్క శాకాహారులు అందరు అమాయకమైన మూగ జంతువులను చంపుతున్నారు అని అంటున్నారు మరి వీళ్ళు చెప్పేది వాస్తవమే కదా . ఇప్పుడు ఇదే ఉదాహరణ ని ఇంకో  కోణం లో చూద్దం .  అదొక  ఎడారి  ప్రాంతం  అక్కడ  చెట్లు ఏమి లేవు  అస్సలు  మన మంతెన  సత్యనారాయణ రాజు గారు చెప్పే fooddu    ఏది లేదు  ఒక్క ఒంటెలు తప్ప అప్పుడు మన పరిస్తితి ఏంటి చచ్చినట్టు మాంసం తినాల్సిందే  కదా లేక పొతే మనంచస్తాం సో, నేను చేపోచేద్ది  ఏమిటి అంటే  ప్రపంచం లో మంచి చెడు అని ఏవి లేవు ఉన్నది  మన అవసరం మాత్రమే  మన అవసరం మనల్ని ఎటు మళ్లిస్తే అటు వెళ్ళడమే . ఒకడి మంచి  ఇంకోడికి  చెడుఅవుతుంది అంతే మంచి సంతోషాన్ని  ఇస్తే చెడు దుక్కాన్ని ఇస్తుంది   అంటే  ఒక ఆట అడితే ఒకరు గెలుస్తారు ఇంకొకరు ఒడాతారు  ఒకడికి మంచి జరిగింది ఇంకోడికి చెడు జరిగింది అంతే . అంటే సంతోషం కలిగితె మంచి  బాధ కలిగితే చెడు అంతే మన మనుషుల ప్రకారం . అంతే  కాని  మంచి కి చెడు కి వీరీ గొప్ప అర్ధాలు ఏమి లేవు   

అంటే మంచి  చెడు ఎలాగు లేదు అన్నాడు కదా వీడు అని  మర్డర్ లు మానబంగాలు చేసుకోడానికి మనకు ఓ వాదన దొరికింది అనుకుంటున్నారా దీనికి ఒక  మెలిక ఉంది మంచి చెడు లేదు అన్న గాని ఏవి ఉన్నాయో ఈ  ప్రపంచం లో మీకు చెప్పలేదు కదా ఈ ప్రంపంచం లో ఉన్నది ఉండాల్సింది న్యాయం  అన్యాయం  ఈ రెండు మాత్రమె . ఉండాలి   పైన  చెప్పిన ఉదాహరణ  తీసుకుంటే  మనకు శాకాహారం అందుబాటులో ఉన్నపుడు  కూడా మాంసాహారం తినడం  అన్యాయం  ఎందుకంటే వాటికి కూడా బ్రతికే  హక్కు ఉంది కాబట్టి  . మాంసాహారం అదీ  తప్ప ఇంకోటి లేదు అనుకున్నపుడు  తినడం వేరు  అప్పుడు అది న్యాయం కాకపొఇన అన్యాయం మాత్రం కాదు . 

న్యాయం మనకి ఆనందం కలుగచేస్తుంది మానసిక తృప్తిని ఇస్తుంది ఇంతకంటే ఎం కావలి మనిషికి . న్యాయమే నీకు మంచి ఇదీ నీకు సుకాన్ని సంతోషాన్ని ఇస్తుంది . అందరు న్యాయం గా ఉండండి  హాయి గా ఉండండి ఎక్కువ కాలం బతకండి .... . . . . . . . . . . . . . . . . . ... . . . . . . . . .. . . . 



అల్ల్ ధీ బెస్ట్ . . . . . . . . . . . . . . . .  . . . . 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి